CM KCR: సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. 

CM KCR: నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. 

Cm Kcr Decision To Release Water To Sagar Left Canal KRJ

CM KCR: నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఈ ఏడాది  నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో సరైన వర్షాలు కురవకపోవడం, వేసిన పంట దెబ్బ తింటుండటంతో ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు.

తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో నీరు ఉన్న నేపథ్యంలో నేటీ నుండి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. వర్షాలు లేక, సాగర్ రిజర్వాయర్ లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా, పొదుపుగా వాడుకోవాలని సీఎం కేసీఆర్ రైతాంగానికి పిలుపునిచ్చారు.

సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios