Hyderabad: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జరుగుతున్న మహిళల ప్ర‌పంచ‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ బిడ్డ‌, నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్  గోల్డ్ మెడ‌ల్ సాధించింది. 50 కిలోల విభాగంలో స్వ‌ర్ణం సాధించిన నిఖ‌త్.. ఈ విజయంతో వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన  రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. 

KCR congratulates Nikhat Zareen on winning gold: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 50 కేజీల కేటగిరీ ఫైనల్స్ విజ‌యంతో స్వర్ణ పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. తెలంగాణ గ‌ర్వించ‌ద‌గ్గ బిడ్డ నిఖ‌త్ అంటూ కొనియాడారు. 

వివ‌రాల్లోకెళ్తే.. దేశ‌రాజ‌ధాని లో వేదిక‌గా జరుగుతున్న మహిళల ప్ర‌పంచ‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ బిడ్డ‌, నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడ‌ల్ సాధించింది. 50 కిలోల విభాగంలో స్వ‌ర్ణం సాధించిన నిఖ‌త్.. ఈ విజయంతో వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. ఈ నేప‌థ్యంలోనే దేశ ప్ర‌జ‌ల నుంచి ఆమెకు ప్ర‌శంసలు వెల్లువెత్తుతున్నాయి. వియత్నాం బాక్సర్ నుయెన్ పై 5-0 తేడాతో విజయం సాధించి బంగారు పతకం సాధించిన జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జరీన్ తన వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రాభవాన్ని మరోసారి చాటారని అన్నారు.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తన కెరీర్ లో రెండో స్వర్ణ పతకం సాధించడం గొప్ప విషయమని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆ దిశగా కృషిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ అభినందనలు..

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకాలు సాధించిన బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్, స‌విటీ బూరా, నీతూల‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో స్వర్ణం సాధించిన నిఖ‌త్ జ‌రీన్ ను అభినందిస్తూ.. "మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో అద్భుత విజయం సాధించి స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ కు అభినందనలు. ఆమె ఒక అద్భుతమైన ఛాంపియన్, ఆమె విజయం అనేక సందర్భాల్లో భారతదేశం గర్వపడేలా చేసింది" అని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.

Scroll to load tweet…