అధైర్యం వద్దు.. నియోజకవర్గ ప్రజలతో ఉండు: మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్.. సహాయ చర్యలపై ఆరా (Video)
భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తారంగా పోలీసుల బస్సులో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి నియోజకవర్గ ప్రజలతో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటమునిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మరికొన్ని చోట్ల ఇళ్లూ నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇలా ఆయన భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటిస్తున్నప్పుడ సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ప్రశాంత్ రెడ్డికి ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సహాయక చర్యల పై ఆరా తీశారు.
బాల్కొండ నియోజకవర్గచ పరిధిలో అధిక వర్షాలు కురుస్తున్నాయని, అయితే.. అధైర్యపడవద్దని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలని సూచనలు చేశారు. ప్రజల మధ్య ఉండాలని అన్నారు. ‘మీకు నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం తెల్లవారుజామునే బాల్కొండ నియోజకవర్గంలో కలియతిరిగారు. పోలీసు బస్సులో నిర్విరామంగా పర్యటిస్తూనే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు.
Also Read: తెలంగాణ వర్షాలు : అమిత్ షా తెలంగాణ పర్యటన .. మరోసారి వాయిదా , తీవ్ర నిరాశలో బీజేపీ శ్రేణులు
కుండపోత వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. అలాగే, ప్రజలకూ ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. వాగులు, డొంకలు పొంగిపొర్లుతున్నందున ప్రజల ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచనలు చేశారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు.