Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వర్షాలు : అమిత్ షా తెలంగాణ పర్యటన .. మరోసారి వాయిదా , తీవ్ర నిరాశలో బీజేపీ శ్రేణులు

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. 

union home minister amit shahs telangana tour postponed again ksp
Author
First Published Jul 27, 2023, 6:04 PM IST | Last Updated Jul 27, 2023, 6:04 PM IST

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఆయన తెలంగాణ పర్యటనకు రావాల్సి వుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామని బీజేపీ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్‌లో నోవాటెల్‌కు చేరుకుని.. రాత్రి 8 గంటల వరకు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios