నా కొడుకు కనిపించడం లేదు.. డీజీపీ కార్యాలయానికి కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు..

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. తన కొడుకు రితీష్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. 

Cm Kcr Brother Daughter Ramya Rao visits DGP Office alleges her son ritish rao missing

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని కుమార్తె రమ్యరావు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. తన కొడుకు, తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీ రితీష్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే తొలుత రమ్యరావును డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను డీజీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై రమ్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వాగ్వాదం తర్వాత రమ్యరావు డీజీపీని కలిసేందుకు అనుమతించారు. 

తన కుమారుడు రితీష్ తీసుకెళ్లి అరెస్ట్ చూపడం లేదని రమ్యరావు ఆరోపించారు. తన కొడుకు ఆచూకీ తెలుపాలని డిమాండ్ చేశారు. తన కొడుకును అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలను చూపాలని కోరారు. తన కుమారుడితో పాటు మరికొందరు ఎన్‌ఎస్‌యూ విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని ఆరోపించారు. 

గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు తమ ఇంటికి తనిఖీ చేశారని.. అసభ్యకరంగా మాట్లాడరని ఆరోపించారు. తన కొడుకు ఇంట్లో లేడని చెప్పిన కూడా పట్టించుకోకుండా తనిఖీలు చేశారని ఆరోపించారు. తన కొడుకు ఇంట్లో లేడని చెప్పిన కూడా పట్టించుకోకుండా తనిఖీలు చేశారని అన్నారు. బంజారాహిల్స్ పోలీసులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios