రిజిస్ట్రేషన్‌లపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశం కానుంది సబ్ కమిటీ.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగుతున్నాయని.. వ్యవసాయతేర భూముల విషయంలోనూ అలాంటి విధానమే రావాలన్నారు కేసీఆర్. ప్రజలెవరూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి రావొద్దన్నారు.

మిగతా రాష్ట్రాలకంటే భిన్నంగా, వారికి ఆదర్శంగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అవసరమైతే ధరణిలో వీటిని చేర్చే విధంగా ఏం చేయాలన్న దానిపై సబ్ కమిటీ చర్చించనుంది. అలాగే సమాచార భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సబ్ కమిటీ కసరత్తు తీసుకోనుంది. 

Also Read:ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లపై త్వరలోనే నిర్ణయం: ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించిన సీఎస్