ఈ నెల 16 నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో టూర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఈ నెల 16వ తేదీ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భట్టి విక్రమార్క వివరించారు.

CLP Team Will Visit Flood Affected Villages From August 16 : Mallu Bhatti Vikramarka

హైదరాబాద్:  ఈ నెల 16వ తేదీ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా CLP  నేత Mallubhatti Vikramarka చెప్పారు.సోమవారం నాడు సీఎల్పీ సమావేశం Hyderabad లో జరిగింది.ఇవాళ జరిగిన  సీఎల్పీ సమావేశంలో మల్లుభట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వివరించారు.  పలు అంశాలపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టుగా భట్టి విక్రమార్క తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో చోటు చేసుకొన్న పరిస్థితుల ను తెలుసుకొనేందుకు గాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నామని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఈ నెల 16 నుండి భద్రాచలం నుండి వరద ప్రభావిత ప్రాంతాల నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆయా జల్లాల్లోని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామని కూడా భట్టి విక్రమార్క తెలిపారు.  చాలా ప్రాజెక్టులు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు.  Kaleshwaram, కడెం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ తీరును కూడా సీఎల్పీ బృందం పరిశీలించనుందన్నారు.  ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని  కూడా ఆయన వివరించారు.

ఈ నెల 9వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ప్రతి జిల్లాలో 75 కి.మీ padayatra నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క వివరించారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు  అవుతున్న సందర్భంగా ప్రతి జిల్లాలో కనీసం 75 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  ఆయన చెప్పారు. 75 మంది నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొనాలని ప్లాన్ చేశామన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న నేతలను సన్మానిస్తూ  ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా భట్టి విక్రమార్క వివరించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఐసీసీ చీఫ్ Sonia Gandhiని, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi ని ఈడీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  కేంద్రంలోని BJP సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఈడీ అధికారుల దాడులతో తేటతెల్లమైందని భట్టి విక్రమార్క ఆరోపించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios