ఖమ్మంలోకి భట్టి పాదయాత్ర: మూడు మాసాల తర్వాత స్వంత జిల్లాకు సీఎల్పీ నేత
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం డీసీసీ కార్యాలయానికి చేరుకుంది. మూడు మాసాల తర్వాత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు.
ఖమ్మం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ శనివారంనాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భట్టి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. మూడు మాసాల తర్వాత స్వంత జిల్లాకు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 16 వ తేదీన భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు. పలు జిల్లాల గుండా యాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది.
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ నుండి ఖమ్మం వరకు 1, 365 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు మల్లు భట్టి విక్రమార్క. ఏడు జిల్లాల్లోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఖమ్మం పట్టణంలోకి భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది.ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ నుండి ఖమ్మం వరకు 1, 365 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు మల్లు భట్టి విక్రమార్క. ఏడు జిల్లాల్లోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఖమ్మం పట్టణంలోకి భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది.
ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం డీసీసీ కార్యాలయానికి భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది. మధ్యాహ్న భోజనం డీసీసీ కార్యాలయ ఆవరణలోనే చేయనున్నారు. ఇవాళ సాయంత్రానికి శ్రీశ్రీ సెంటర్ కు మల్లుభట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంటుంది. రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పాదయాత్రకు మల్లు భట్టి విక్రమార్క చేరుకుంటారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు రేపు సాయంత్రం పాదయాత్రగా ఖమ్మం సభకు చేరుకుంటారు. రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు.
వంద రోజులకు పైగా పాదయాత్ర నిర్వహించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానించారు. మరో వైపు మేడారం నుండి పాదయాత్ర నిర్వహించిన రేవంత్ రెడ్డిని కూడ రాహుల్ గాంధీ ఇదే వేదికపై సన్మానించనున్నారు.
also read:ఖబడ్దార్ పొంగులేటి అంటూ ఖమ్మంలో పోస్టర్లు: కన్నీళ్లు పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. తెలంగాణలో ఈ దఫా ఎన్నికల్లో రావాలని ఆ పార్టీ వ్యూహాంతో ముందుకు వెళ్తుంది.