టిక్కెట్ల కేటాయింపులో నిర్ధిష్ట విధానం: కోమటిరెడ్డితో భట్టి భేటీ

హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా  కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క  ఈ నెల  16 నుండి పాదయాత్రను  ప్రారంభించనున్నారు.ఈ యాత్రకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మల్లు భట్టి విక్రమార్క ఆహ్వానించారు. 

CLP Leader  Mallu Bhatti Vikramarka meets  Bhuvanagiri MP Komatireddy Venkat Reddy

హైదరాబాద్: తన పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కొన్ని సూచనలు  చేశారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.ఆదివారంనాడు  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క   భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో  భేటీ అయ్యారు.  ఈ నెల  16వ తేదీ నుండి  తాను ప్రారంభించనున్న పాదయాత్ర గురించి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో  ఆయన  చర్చించారు.  ఈ యాత్రకు  సహకరించాలని  కోరారు.  సుమారు గంటకు పైగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  సమావేశమయ్యారు.ఈ సమావేశం  ముగిసిన తర్వాత  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 

ఈ నెల  16 నుండి తాను ప్రారంభించే  పాదయాత్రలో  పాల్గొనాలని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని  కోరినట్టుగా  ఆయన  చెప్పారు. ఈ యాత్రకు సంబంధించి  ఎంపీ వెంకట్ రెడ్డి  చేసిన సూచనలను పాటించనన్నట్టుగా ఆయన తెలిపారు.  

రేవంత్ రెడ్డి  పాదయాత్ర రూట్ వేరని. తన పాదయాత్ర రూట్ వేరేనని  ఆయన  చెప్పారు. 60 శాతం టికెట్లు ఖరారైనట్టుగా తనకు  తెలియదని భట్టి విక్రమార్క  చెప్పారు. టికెట్ల కేటాయింపులో నిర్ధిష్ట విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని  ఆయన తేల్చి  చెప్పారు. ఆ విధానం ప్రకారంగానే  టికెట్ల కేటాయింపు  ఉంటుందన్నారు. 

హాత్ సే హత్ జోడో  అభియాన్ లో భాగంగా   మల్లు భట్టి విక్రమార్క ఈ నెల  16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా నుండి ఖమ్మం  వరకు  పాదయాత్ర  చేయనున్నారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో కలిసి  మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు.   

also read:పేపర్ పులిలా రంకెలేయొద్దు.. బండి సంజయ్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈ ఏడాది ఫిబ్రవరి  6వ తేదీన   మేడారంలో  పాదయాత్రను ప్రారంభించారు.  ఇటీవలనే  నిర్మల్  నుండి  మాజీ ఎమ్మెల్యే  మహేశ్వర్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు.  హైద్రాబాద్  వరకు  మహేశ్వర్ రెడ్డి  పాదయాత్ర  సాగనుంది.   టీపీసీసీ మాజీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి  కూడా పాదయాత్రను నిర్వహించనున్నారు.. పాదయాత్ర  నిర్వహిస్తానని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కూడా ప్రకటించారు. కానీ  పాదయాత్ర  గురించి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఇంకా  రూట్  మ్యాప్ ను  ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల  తర్వాత  పాదయాత్రపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  నుండి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios