తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారు: భట్టి విక్రమార్క సంచలనం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

CLP Leader  Mallu Bhatti Vikramarka   Comments on Tummala Nageswara rao  joining in Congress lns


హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
సోమవారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.కాంగ్రెస్ తో కలిసి నడవాలని వామపక్షాలు భావిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అందరూ బతుకుతారన్నారు.మోడీ పాలనలో కేపిటలిస్టులు, కేసీఆర్ పాలనలో దొరలు బతుకుతున్నారని ఆయన  ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో  సంపదను సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ రూ. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేసిందని ఆయన  ప్రశ్నించారు.

భేషరతుగా  ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: మల్లు భట్టి విక్రమార్క

  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.  బేషరతుగా  పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఎందుకు జరిగిందో ప్రజలకు  తెలుసునన్నారు.  తమ ప్రభుత్వం రాగానే  దళితుల భూములను వారికే ఇచ్చేస్తామని  భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ నెల  21న బీఆర్ఎస్ విడుదల చేసిన జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కలేదు. దీంతో  తుమ్మల నాగేశ్వరరావు  అసంతృప్తికి గురయ్యారు. పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేయాలని  తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం  తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు ఇవ్వలేదు. పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తికి గురయ్యారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios