కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ఊహజనితం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ఊహజనితమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు.
హైదరాబాద్: కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు చేయడం ఊహజనితమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివారం నాడు సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ ఏర్పాటు చేసి విధి విధానాలు ప్రకటించిన తర్వాత ఈ విషయమై స్పందించనున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు.
ఎఐసీసీ అధ్యక్ష పదవికి మల్లు భట్టి విక్రమార్క తన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. మల్లికార్జున ఖర్గే ఎఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు థరూర్ తన నామినేషన్ ను ఉపసంహించుకోవాలని ఆయన కోరారు. ఖర్గే గాంధేయవాది భట్టి విక్రమార్క గుర్తు చేశారు. గాంధీ మన దేశంలో పుట్టడం మన అదృష్టమన్నారు. గాంధీ చూపిన మార్గం మానవాళికి అనుసరణీయమన్నారు. ప్రస్తుతం దేశంలో అశాంతి, విభజన చోటు చేసుకుందన్నారు.
ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా విజభన పెరిగిందన్నారు. ఒకరిద్దరి దగ్గరే దేశ సంపదంతా పోగైందని ఆయన విమర్శించారు. దళిత,. గిరిజన బస్తీల్లో సరైన సైకర్యాలు లేవన్నారు. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయడం మంచిదేననన్నారు. ఖర్గే ఓటమి ఎరుగని నేత అని ఆయన చెప్పారు. శశిథరూర్ కూడా ఖర్గే గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.