కుర్ముద్దిలో ఫార్మా భూములు కోల్పోతున్న రైతులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రైతుల భూములను కోటీ యాభై లక్షల  రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆ కోటీన్నరకు అసలు హక్కుదారుడు రైతేనని విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవహారంపై బాధితులంతా ప్రశ్నించాల్సిన అవసరం వుందన్నారు. ఈ సమస్య ఇక్కడి రైతులొక్కరిదే కాదన్న భట్టీ.. ఫార్మా కంపెనీ పెట్టిన తర్వాత ఇక్కడ కాలుష్యం పెరిగిపోతుందన్నారు.

వర్షపు నీటి ద్వారా ఈ ప్రాంతంలోని కాలుష్యమంతా మైళ్ల దూరంలోని కృష్ణానదికి చేరి రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుందని విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే రాష్ట్రం మొత్తాన్ని కదిలిస్తామని ఆయన స్పష్టం చేశారు.