Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రాజెక్ట్‌లు.. మేం ముందే హెచ్చరించాం, కేసీఆర్‌ సర్కార్‌ది మొద్దు నిద్ర: భట్టి విక్రమార్క

సంగమేశ్వర ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో జారీ చేసిందన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా టీఆర్ఎస్ తీరు వుందన్నారు విక్రమార్క

clp leader bhatti vikramarka slams telangana cm kcr over ap projects ksp
Author
Hyderabad, First Published Jun 23, 2021, 4:06 PM IST

సంగమేశ్వర ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో జారీ చేసిందన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా టీఆర్ఎస్ తీరు వుందన్నారు విక్రమార్క. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కట్టి నీళ్లు తీసుకెళ్తుందని గతంలోనే తాము చెప్పామని ఆయన గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేం హెచ్చరించామని విక్రమార్క చెప్పారు.

Also Read:ఏపీ ప్రాజెక్టులపై క్రిష్ణ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు..

తాము ముందే హెచ్చరించినా కేసీఆర్ మొద్దు నిద్ర వీడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఊర్లలో తిరుగుతూ తుపాకీ రామునిలా ప్రగల్భాలు పలుకుతున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలపై నియంత్రణ లేదని ఆయన ఆరోపించారు. సీఎం ట్రీట్‌మెంట్ తీసుకునే ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు లక్షలు ఎలా వసూలు చేస్తోందని విక్రమార్క ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios