Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌పై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్-బీజేపీ ఎజెండాలో భాగంగానే ఇలా : భట్టి విక్రమార్క

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వుండకూడదని బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత ఆరోపించారు.

clp leader bhatti vikramarka reacts on bjp mla etela rajender remarks on tpcc chief revanth reddy ksp
Author
First Published Apr 23, 2023, 4:31 PM IST | Last Updated Apr 23, 2023, 4:30 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఛార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ పైనా బురద జల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల నిన్నటి దాకా వున్న భూస్వాముల పార్టీ మాది కాదంటూ చురకలంటించారు. కాంగ్రెస్‌పై పడి ఏడవటం దేనికని భట్టి దుయ్యబట్టారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వుండకూడదని బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసం, దోపిడీలోనూ ఈటల భాగమేనని విక్రమార్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎజెండాలో భాగంగానే ఈటల మునుగోడు ఉపఎన్నిక విషయాన్ని ప్రస్తావించారని ఆయన ఆరోపించారు.

Also Read: వీరుడు కన్నీళ్లు పెట్టుకోడు: రేవంత్ రెడ్డికి ఈటల కౌంటర్

ఇకపోతే.. శనివారంనాడు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చేసిన ఆరోపణలపై  ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో  ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో  తాను ఏ రాజకీయ నేత గురించి మాట్లాడలేదని  ఈటల రాజేందర్ స్పష్టం  చేశారు. తాను రేవంత్ రెడ్డి  పేరే ప్రస్తావించలేదన్నారు. కానీ  భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  రేవంత్ రెడ్డి  కన్నీళ్లు పెట్టుకుంటూ  తన గురించి అసభ్యంగా మాట్లాడారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను  నిత్యం  ఉద్యమం చేసినట్టుగా ఆయన  గుర్తు  చేశారు. కానీ  ఆ సమయంలో  రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగాడని  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు.   

రేవంత్ రెడ్డికి తనకు  పోలిక ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు  నోటు కేసులో  రేవంత్ రెడ్డి  జైలుకు పోయి వచ్చాడన్నారు. తాను విద్యార్ధిగా  ఉన్న సమయంలోనే  జైలుకు వెళ్లివచ్చినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. విద్యార్ధి సమస్యలపై తాను పోరాటాలు  చేసినట్టుగా  ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజల కోసం  పోరాడి  రేవంత్ రెడ్డి  జైలుకు వెళ్లలేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios