Asianet News TeluguAsianet News Telugu

ధరణి పోర్టల్ ఒక మహమ్మారి.. రైతులే వద్దంటున్నారు : భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. 

clp leader bhatti vikramarka fires on telangana cm kcr at jana garjana sabha in khammam ksp
Author
First Published Jul 2, 2023, 6:52 PM IST

సీఎం కేసీఆర్ ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ.. భారత్ జోడో యాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అన్నారు. అధికార మదంతో వీర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యం అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ మార్చ్ సమయంలో వాగులు, వంకలు , కొండలు, గుట్టలు ఎక్కానని.. ఒక్కొక్కరిది ఒక్క దీనగాథ అన్నారు. మార్చి 16న పాదయాత్రను ప్రారంభించానని  భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారని .. కానీ పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టారని ఆయన మండిపడ్డారు. 

కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నేషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా పనిచేసిన వ్యక్తి .. జీవనోపాధి కోసం సోడా బండి పెట్టుకుని నడుకుంటున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నేను పాదయాత్ర చేస్తుంటే కొండంత ధైర్యం వచ్చిందని.. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నానని విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios