స్కూల్ నుంచి ఇంటికి వస్తూ.. తాను ప్రయాణిస్తున్న బస్సులోంచి జారిపడి.. ఆ బస్సు చక్రాల కిందే నలిగిపోయి ఓ 8యేళ్ల చిన్నారి మృతి చెందాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సు కింద పడి 8యేళ్ల చిన్నారి మృతి చెందాడు. హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలోని టెక్స్‌టైల్ గ్రామం పోచంపల్లిలో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు నుండి కిందపడి.. అదే బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఆ విద్యార్థి అభిలాష్. బస్సు డోర్‌కు తాళం వేయకపోవడం బస్సు నుంచి కిందపడిపోయాడు.
స్కూలు అయిపోయిన తరువాత సాయంత్రం బస్సు విద్యార్థులను వారి వారి ఇళ్లకు చేరుస్తోంది. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. “ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు బస్సు మెట్ల దగ్గర నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ బస్సును మలుపు తిప్పడంతో బాలుడు కింద పడ్డాడు. ఆ తరువాత బస్సు నుండి జారిపడి వెనుక చక్రం కింద పడ్డాడు. దీంతో అది అతని మీదినుంచి వెళ్లింది”అని సబ్-ఇన్‌స్పెక్టర్ వి సైదిరెడ్డి తెలిపారు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మైనర్ల కిడ్నాప్.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను అరెస్టు చేసిన యూపీ పోలీసులు
మృతుడు అభిలాష్ ఒకటో తరగతి విద్యార్థి. బాలుడి గ్రామానికి 200 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “బస్సు కదులుతున్నప్పుడు డోర్ మూసి ఉంచి ఉంటే, ప్రమాదం జరిగి ఉండేది కాదు అని పోలీసులు చెప్పారు. “విద్యార్థులకు అటెండెంట్ గా ఓ ముసలామె ఉంది. ఆమె బస్సు తలుపు తాళం వేయడం మరిచిపోయింది.
ఇతర విద్యార్థులు బస్సులో కూర్చున్నారు. అభిలాష్ మాత్రం విషాదం సంభవించినప్పుడు బస్సు దిగడానికి నిలబడి ఉన్నాడు”అని పోలీసులు తెలిపారు. పోచంపల్లి పోలీసులు బస్సు డ్రైవర్ రాములు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బాలుడి తండ్రి రైతు అని పోలీసులు తెలిపారు.
