నేతలు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మాధవరం కృష్ణారావుపై కార్పొరేటర్ కావ్యారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

కూకట్ పల్లి టీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. నేతలు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మాధవరం కృష్ణారావుపై కార్పొరేటర్ కావ్యారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణారావు భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

ఒకే పార్టీలో ఉన్నా తమపై అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. బాలాజీనగర్ డివిజన్ అభివృద్ధిని కృష్ణారావు అడ్డుకున్నారని, నిధులను దారి మళ్ళించి తన భవనాలకు రోడ్లు వేయించారని విమర్శించారు. 

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే.. పట్టించుకోవద్దని కృష్ణారావు ఆదేశించారని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కృష్ణారావుకు తనను రాజీనామా చెయ్యమనే హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నానని కావ్యారెడ్డి చెప్పారు.