నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా నల్గొండలోని పోలింగ్  కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది.రెండు పార్టీల  కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేసుకొన్నారు.దీంతో ఒకానొక దశలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం నాడు జరుగుతున్నాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు వేసేందుకుగాను పోలింగ్ కేంద్రానికి సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో టీఆర్ఎస్ వర్గీయులు ఉన్నారు.ఈ విషయాన్ని గుర్తించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఆర్ అండ్ బి అతిథిగృహం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నేతలను ఎలా గెస్ట్ హౌజ్‌లోకి అనుమతిస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.  తాము కూడ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో కూర్చొంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

దీంతో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఉన్న టీఆర్ఎస్‌ నేతలను పోలీసులు బయటకు పంపారు. ఈ సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒకానొక దశలో ఉద్రికత్త చోటు చేసుకొంది.