సిద్దిపేట: సిద్దిపేటలో సోమవారం నాడు రాత్రి బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. రెండు పార్టీలకు చెందిన పార్టీల కార్యకర్తలు కొట్టుకొన్నారు.దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల్లోనే దుబ్బాక ఉప ఎన్నిక జరిగే సమయంలో ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరగడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్ వద్ద తనిఖీల కోసం బీజేపీ కార్యకర్తలు వచ్చారు. బీజేపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకొన్నారు.ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై దాడికి ప్రయత్నించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్ సెంటర్ కేంద్రంగా చేసుకొని టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హోటల్‌లో గదులు ఉన్నాయా అని ఆరా తీస్తూ హోటల్ గదిలోకి దూరి దాడికి దిగారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

బీజేపీ కార్యకర్తల దాడిలో తమ పార్టీకి చెందిన కార్యకర్త చేయి విరిగిందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల దాడి గురించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. 

తనపై ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చెప్పారు.శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నించే కార్యక్రమంలోనే భాగంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.