ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో రైతు రచ్చబండ'రచ్చ': కొట్టుకున్న మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాలు

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది.. కోమటిపల్లిలో నిర్వహించిన రచ్చబండ రచ్చగా మారింది. సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

Clashes Between Congress Leaders Madan Mohan And Subash Reddy followers At Komatipalli In Kama Reddy District

ఎల్లారెడ్డి:  ఉమ్మడి Nizambad జిల్లాలోని Congress పార్టీలో నేతల మధ్య అధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు వర్గం, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహా బాహీకి దిగారు. ఈ విషయమై ఇరు వర్గాలు పరస్పరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు.

Yella Reddy నియోజకవర్గంలోని Lingampet మండలం కోమటిపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి  మదన్ మోహన్ రావు వర్గీయులు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న Subash Reddy వర్గీయులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లా రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా సుభాష్ రెడ్డి కొనసాగుతున్నారు. సుభాష్ రెడ్డికి తెలియకుండానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ రెడ్డికి తెలియకుండా రచ్చబండ నిర్వహించడంపై మండిపడ్డారు. ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Madan Mohan Rao  వ్యవహరశైలిపై జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై పార్టీ  జిల్లా నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ మదన్ మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు కూడా వేశాడు.ఈ వివాదం కాంగ్రెస్ లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ విషయమై డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

also read:48 గంటల్లో వివరణ ఇవ్వాలి:మదన్ మోహన్ రావు సస్పెన్షన్ పై డీసీసీకి పీసీసీ నోటీస్

నిజామాబాద్ జిల్లా నుండి మదన్ మోహన్ రావు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.  జిల్లా వ్యాప్తంగా తన వర్గాన్ని ఏర్పాటు మదన్ మోహన్ రావు ఏర్పాటు చేసుకొంటున్నారు. బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారనే మదన్ మోహన్ రావుపై ప్రత్యర్ధి వర్గం ఆరోపణలు చేస్తుంది.

కామారెడ్డిలో ఇటీవల జాబ్ మేళాను మదన్ మోహన్ రావు నిర్వహించారు.ఈ జాబ్ మేళాకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి తెలియకుండానే నిర్వహించారని ఆ వర్గం గుర్రుగా ఉంది. అంతేకాదు ఈ జాబ్ మేళాకు అజహరుద్దీన్ ను కూడా రప్పించడం కూడా వైరి వర్గాన్ని తీవ్ర ఆగ్రహన్ని తెప్పించింది. 

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్‌మోహన్‌రావును పార్టీ లైన్‌ దాట వద్దని క్రమశిక్షణ సంఘం గతంలోనే హెచ్చరించింది.  ఈ నెల 2న నిర్వహించిన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశంలో  మదన్ మోహన్ రావుకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

పార్టీ పేరుతో కాకుండా మదన్‌ యూత్‌ ఫోర్స్‌ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ప్రస్తావించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపింది. మదన్‌మోహన్‌ను సస్పెండ్‌ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios