Asianet News TeluguAsianet News Telugu

48 గంటల్లో వివరణ ఇవ్వాలి:మదన్ మోహన్ రావు సస్పెన్షన్ పై డీసీసీకి పీసీసీ నోటీస్

కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ విభాగం చైర్మెన్ మదన్ మోహన్ రావును ఏడాది పాటు పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై వివరణ ఇవ్వాలని కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ కి పీసీసీ  నోటీసులు పంపింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

PCC  Issues Notice To Kama Reddy DCC President Srinivas Over Madan Mohan Rao Suspension
Author
Kamareddy, First Published Apr 24, 2022, 3:58 PM IST

హైదరాబాద్:  పార్టీ నేత మదన్ మోహన్ రావుని ఏ ప్రాతిపదికన సస్పెండ్ చేశారో చెప్పాలని  కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ కి  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నాడు నోటీసులు పంపారు.

రెండు రోజుల క్రితం Madan Mohan Raoని  సస్పెండ్ చేస్తున్నట్టుగా Kamareddy DCC అధ్యక్షుడు Srinivas ప్రకటించారు.   ఈ విషయమై మదన్ మోహన్ రావు PCCకి ఫిర్యాదు చేశారు.  పీసీసీ ఐటీ సెల్ చైర్మెన్ మదన్ మోహన్ రావును ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియాకు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 

గతంలో zahirabad పార్లమెంట్ స్థానం నుండి ఆయన బీబీ పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యాడు.  ఇటీవల కాలంలో ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి మదన్ మోహన్ రావు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం మదన్ మోహన్ రావుపై సస్పెన్షన్ విధించడం పార్టీలో కలకలం రేపింది. జిల్లా వ్యాప్తంగా తన వర్గాన్ని ఏర్పాటు మదన్ మోహన్ రావు ఏర్పాటు చేసుకొంటున్నారు. బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారనే మదన్ మోహన్ రావుపై ప్రత్యర్ధి వర్గం ఆరోపణలు చేస్తుంది.

కామారెడ్డిలో ఇటీవల జాబ్ మేళాను మదన్ మోహన్ రావు నిర్వహించారు.ఈ జాబ్ మేళాకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి తెలియకుండానే నిర్వహించారని ఆ వర్గం గుర్రుగా ఉంది. అంతేకాదు ఈ జాబ్ మేళాకు అజహ ారుద్దీన్ ను కూడా రప్పించడం కూడా వైరి వర్గాన్ని తీవ్ర ఆగ్రహన్ని తెప్పించింది. 2019 ఎన్నికల్లో మదన్ మోహన్ రావు 6 వేల ఓట్లతో తేడాతోనే ఓటమి పాలయ్యాడు. పార్టీ నేతలు తన గెలుపునకు సహకరిస్తే తాను విజయం సాధించేవాడినని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ దఫా మాత్రం అసెంబ్లీకి పోటీ చేసేందుకు మదన్ మోహన్ రావు ప్లాన్ చేసుకంటున్నారు.

మదన్ మోహన్ రావు సస్పెన్షన్ పై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను పీసీసీ ఆదేశించింది. మదన్ మోహన్ రావును ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని పీసీసీ ప్రశ్నించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios