Asianet News TeluguAsianet News Telugu

గుర్రంపోడు: బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ఉద్రిక్తత

నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

clash between trs and bjp activists in gurrampode ksp
Author
Gurrampode, First Published Feb 7, 2021, 5:41 PM IST

నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతో గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగాయి.

అక్కడే వున్న షెడ్డును ఇరు వర్గాలు ధ్వంసం చేశాయి. ఇప్పటికే గుర్రంపోడుకు బండి సంజయ్, విజయశాంతి చేరుకున్నారు. తొలుత గిరిజనులను భూముల్లోకి రాకుండా రవీందర్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బీజేపీ కార్యకర్తలను నిలువరించేందుకు గాను పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అయితే రాళ్లదాడిలో సీఐకి గాయాలయ్యాయి

Follow Us:
Download App:
  • android
  • ios