తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సికింద్రాబాద్‌లో కాషాయ నేతలు బాహాబాహీకి దిగి, నడిరోడ్డుపై చొక్కాలు చించుకున్నారు. తార్నాక డివిజన్‌ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్‌ దాడి చేశారు.

దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు అసభ్యపదజాలంతో దూషించుకుంటూ రచ్చరచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది.

దీంతో ఇరువర్గాలు ఆయన నివాసానికి చేరుకున్నాయి. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే అక్కసుతో శారదా మల్లేష్‌ దాడికి దిగినట్లు తెలుస్తోంది.