Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కుర్రాడు సివిల్స్ టాపర్: "జెడి"లక్ష్మినారాయణ కొడుక్కి 196వ ర్యాంక్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సివీల్స్ జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచాడు.

Civils topper is from Telangana

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సివీల్స్ జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచాడు. గతంలో ఇదే పరీక్షల్లో అతను మామూలు ర్యాంక్ సాధించి రెవెన్యూ విభాగంలో సహాయ కమిషనర్ గా చేరాడు. 

అయితే, దాంతో ఆగకుండా అతను పట్టుదలతో చదివి సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలోనే అగ్రస్థానం పొందాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన కోయ శ్రీహర్ష ఆరవ ర్యాంక్ సాధించాడు. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జెడి లక్ష్మీనారాయణ కుమారుడు వివి సాయి ప్రణీత్196వ ర్యాంక్ సాధించాడు. 

మొత్తం 990 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేసిన విషయాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిపిఎస్సీ) బుధవారంనాడు ప్రకటించింది.  మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూతురు పనబాక రచన 929 ర్యాంక్ సాధించారు.

అనుకుమారి రెండవ స్థానం, సచిన్ గుప్తా మూడవ స్థానం సాధించారు. మహిళల్లో అగ్రస్థానంలో నిలిచిన అనుకుమారి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో బిఎస్సీ (ఆనర్స్) చదివారు. నాగపూర్ లోని ఎఎంటిలో ఎంబిఎ (ఫైనాన్స్, మార్కెటింగ్) చదివారు. 

వికలాంగురాలైన సౌమ్య శర్మ తొమ్మిదో ర్యాంక్ సాధించారు. తొలి 25 ర్యాంకులు సాధించినవారిలో 8 మంది యువతులు, 17 మంది యువకులు ఉన్నారు. 

సివిల్స్ లో సత్తా చాటిన కొంత మంది తెలుగువాళ్లు

దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్, కోయ శ్రీహర్ష 6వ ర్యాంక్, పృథ్వీతేజ 24వ ర్యాంక్, సాయితేజ 43వ ర్యాంక్, జమీల్ ఫాతిమా జీబా 62వ ర్యాంక్ భార్గవ తేజ 88వ ర్యాంక్, జి మాధురి 144వ ర్యాంక్, నాగ వెంకట మణికంఠ 206వ ర్యాంక్, కె. వరుణ్ రెడ్డి 225వ ర్యాంక్, ఎస్ ప్రతాప్ సింగ్ 295వ ర్యాంక్, మృత్యుంజయ 299వ ర్యాంక్, సత్యప్రసాద్ 331వ ర్యాంక్, ఎస్ ఆదర్శ్ 393వ ర్యాంక్, సాయినాథ రెడ్డి 480వ ర్యాంక్, అక్షయ్ కుమార్ 624వ ర్యాంక్, బి అశ్వఘోష్ 648వ ర్యాంక్, హృదయ కుమార్ దాస్ 680 ర్యాంక్, అలేఖ్య 721వ ర్యాంక్, జీ సందీప్ 761వ ర్యాంక్, పనబాక రచన 929వ ర్యాంక్

Follow Us:
Download App:
  • android
  • ios