పాతబస్తీలో ఆరుగురు యువకులు హల్ చల్ చేశారు. అర్థరాత్రి ఆటోలతో సర్కస్ ఫీట్లు చేస్తూ నడిరోడ్డు మీద భయాందోళనలు సృష్టించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి వైరల్ గా మారడంతో.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

కేశవగిరి : పాతబస్తీ ప్రధాన రహదారులపై గురువారం అర్ధరాత్రి auto వాలాలు మూడు ఆటోలతో ప్రాణాంతక విన్యాసాలు చేశారు. ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విన్యాసాల వీడియోలు viral కావడంతో పోలీసులు స్పందించి, ఏడుగురిపై case నమోదు చేశారు. ఆరుగురిని arrest చేయగా... మరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దక్షిణ మండలం డిసీపీ డాక్టర్ గజరావు భూపాల్, ఫలక్ నుమా ఏసీపీ మహమ్మద్ మజీద్ వివరాల ప్రకారం.. టోలీచౌకి ఎండి లైన్స్ కు చెందిన ఆటోడ్రైవర్లు సయ్యద్ జుబేర్ (20), సయ్యద్ సాహిల్ (21), మహమ్మద్ ఇనాయత్ (23), మహమ్మద్ సమీర్ (19), మహమ్మద్ ఇబ్రహీం (22), గోల్కొండ నివాసి, ప్రైవేటు ఉద్యోగం చేసే గులాం సైఫుద్దీన్ (23), కూలి పని చేసే ఆమెర్ ఖాన్(20) గురువారం 3 ఆటోలో పాతబస్తీ కి వచ్చారు.

సంతోష్ నగర్ నుంచి అర్ధరాత్రి తిరిగి వెళుతూ.. కంచన్బాగ్ చాంద్రాయణగుట్ట రోడ్డుపై ఆటోలతో విన్యాసాలు చేయసాగారు. ఆటో లను వంచుతూ, లేపుతూ కేకలేస్తూ దూసుకెళ్లారు. ఈ చర్యలతో ఇతర వాహనదారులు బెంబేలెత్తారు. కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. చాంద్రాయణగుట్ట డీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సైలు గౌస్ ఖాన్, కె. గోవర్ధన్ రెడ్డి ఆటో నెంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. జుబేర్, సాహిల్, ఇనాయత్, సైఫుద్దీన్, సమీర్, ఆమెర్ ఖాన్ ను అరెస్టు చేసి, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. ఏసీపీ మజీద్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మూడు ఆటోలకు రూ. 5410, రూ.5380, రూ.3810 పెండింగ్ చలానా లు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, Hyderabad ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) పల్లె రాఘవేంద్ర గౌడ్ మరణించారు. శంషాబాద్ నుంచి తుక్కుగుడా వెళ్తున్న కారు లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాఘవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ రైల్వే పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 21న కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరోగ్యం బాగాలేని అత్తను పరామర్శించడానికి బయలు దేరింది ఆ family. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదలడం ఎందుకులే అనుకుని twins సహా మరో చిన్నారితో బండిపై బయలు దేరింది. సరదాగా సాగిపోతున్న వారి ప్రయాణాన్ని.. ఓ వ్యాన్ మృత్యువు రూపంలో వెంబడించింది. బండిని కొట్టడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. దంపతులతో పాటు కవలలిద్దరూ మృతి చెందగా, మరో చిన్నారి కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. 

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర road accidnetలో ఒకే కుటుంబానికి చెందిన four members మృతిచెందగా.. చిన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గుత్తినదీవి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ వైదాడి కుమార్ (35), భార్య పద్మ (31), కుమారుడు సత్యవర్మ (10), కుమార్తెలు హర్షిత (10) సాత్విక (సిరి వదన)తో కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది.