సినిమా ప్రేమికులకు శుభవార్త. తెలంగాణలో నేటినుంచి థియేటర్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్.. లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడ్డ థియేటర్లు దాదాపు 9 నెలల తరువాత తెరుచుకున్నాయి.

కోవిడ్ నేపథ్యంలో మూతబడ్డ థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు క్రిస్మస్, వైకుంఠఏకాదశి.. మంచి రోజు కావడంతో యజమానులు థియేటర్లను పున:ప్రారంభించారు. 

దాదాపు 9 నెలల తర్వాత తెలుగు భారీ బడ్జెట్ ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రం థియేటర్లోకి నేరుగా విడుదలవుతోంది. కరోనా నేపథ్యంలో మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించేలా  థియేటర్ల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

ధర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ప్రేక్షకులను థియేటర్ లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తెలిపారు.