సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాముడిని కించపరిచేలా సినీ క్రిటిక్ కత్తి మహేష్ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంలో ఇటీవల ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఫిబ్రవరి నెలలోనూ ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన వ్యాఖ్యలపై జాంబాగ్ కు  చెందిన ఉమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు.దీంతో.. మరోసారి కత్తి మహేష్ ని అరెస్టు చేశామని సైబర్ ఇన్ స్పెక్టర్ మోహన్ రావు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. సరిగ్గా కొద్దిరోజుల కిందటే మహేష్ కత్తిని సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్‌ 154 కమ్యూనల్‌ యాక్ట్‌ కింది ఈ కేసు నమోదైంది. తన అరెస్ట్ విషయాన్ని కత్తి మహేష్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

`ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన కంప్లయింట్‌లో భాగంగా సైబర్‌ పోలీసులు ఈ రోజు ఉదయం నన్ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ మీటింగ్‌ (బహుజన మీటింగ్‌)లో రామాయణంలో రాముడి పాత్రపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి మళ్లీ అరెస్ట్ చేశారు.

నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఫిబ్రవరి 14న ఐమాక్స్ థియేటర్‌ దగ్గర నా మీద ఫిజికల్ ఎటాక్‌కు ప్రయత్నించి సందర్భంగా నమోదైన కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు. ఈ దేశంలో మతపరమైన నమ్మకాలు, ప్రాణాలు తీసే బెదిరింపుల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్` అంటూ కామెంట్ చేశాడు కత్తి మహేష్‌.