ఛైల్డ్ వేల్పేర్ అధికారుల విచారణకు హాజరైన కరాటే కళ్యాణి

సినీ నటి కరాటే కళ్యాణి ఇవాళ ఛైల్డ్ వేల్పేర్ అధికారుల ముందు హాజరయ్యారు. తాను దత్తత తీసుకోవాలని భావిస్తున్న అమ్మాయితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉన్నారు.
 

Cine Actress Karate Kalyani  Appears  before CWC officers Today

హైదరాబాద్: సినీ నటి Karate Kalyani   ఛైల్డ్ వేల్పేర్ అధికారుల ముందు మంగళవారం నాడు హాజరయ్యారు. తాను దత్తత తీసుకోవాలంటున్న మౌక్తిక పేరేంట్స్ తో కలిసి కరాటే కళ్యాణి ఇవాళ హాజరయ్యారు. కరాటే కళ్యాణి నివాసంలో ఉన్న పిల్లల విషయమై Child Welfare  అధికారులు విచారణకు రావాలని కోరడంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. మరో వైపు ఇదే విషయమై హైద్రాబాద్ కలెక్టర్ Sharman ఇవాళ కలిసేందుకు కళ్యాణి వెళ్లారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు రావాలని కలెక్టర్ అనుమతి ఇస్తే  మధ్యాహ్నం మూడు గటటలకు కళ్యాణి రావడంతో రేపు రావాలని కలెక్టర్ సూచించారు.  కరాటే కళ్యాణి ఇంట్లో పిల్ల విషయమై  కలెక్టర్ Notice జారీ చేశారు.

తాను ఎక్కడికి పారిపోలేదని కూడా కరాటే కళ్యాణి సోమవారం నాడు రాత్రి తెలిపింది. తాను కలెక్టర్ ను, సీడబ్ల్యూసీ అధికారులను కలుస్తానని కూడా తెలిపింది. ఈ మేరకు ఇవాళ ఆమె సీడబ్లూసీ అధికారుల వద్దకు వెళ్లింది. 


సినీనటి కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ నెల 15న  సోదాలు నిర్వహించారు.ఆమె ఇంట్లో వుంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మీ స్పందించారు. తాము ఏ తప్పు చేయలేదని చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి పెంచుతోందన్నారు. ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటోందని విజయలక్ష్మీ తెలిపారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని అమ్మాయి పేరు మౌక్తిక అని ఆమె తెలిపారు. అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చామని విజయలక్ష్మి చెప్పారు. 

రెండు రోజుల క్రితం తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే .ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని  బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

ఈ విషయమై వివరణ కోరగా సీఐ సైదులు చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేశామన్నారు.  కళ్యాణి మాత్రం తనను అన్యాయంగా కేసులో ఇరికించావని గొడవ పెట్టుకొందన్నారు. ఈ దాడికి కారకులు ఎవరనేది తేలగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీఐ సైదులు వెల్లడించారు.

also read:నేనెక్కడికి పారిపోలేదు, పరుగెత్తించే రకం: కరాటే కళ్యాణీ

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి   శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరిగింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డిపై కల్యాణి దాడి  చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మరోవైపు శ్రీకాంత్ తనపై కూడా దాడి చేసినట్టుగా కల్యాణి తెలిపింది. ఫ్రాంక్‌ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios