బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు: పాల్గొన్న బాలకృష్ణ
బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల్లో సినీ నటుడు, సంస్థ ఛైర్మెన్ బాలకృష్ణ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను బాలకృష్ణ కట్ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు.
హైదరాబాద్: నగరంలోని Basavatarakam Indo American Cancer Hospital Research Institute లో సోమవారం నాడు Christmas వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ హాస్పిటల్ లో నిర్వహించిన ఈ వేడుకలలో ఆసుపత్రి చైర్మెన్ నందమూరి Balakrishna ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్రిస్టమస్ కేక్ ను బాలకృష్ణ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రిస్‌మస్ పండుగ జరుపుకుంటన్న వారందరికీ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
మానవ సేవే మాధవ సేవే అన్న విషయాన్ని క్రిస్టమస్ ద్వారా తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు. మన భారత దేశంలో అన్ని మతాల వారు కలసి మెలసి జీవిస్తున్నారని తద్వారా పరమత సహనం ఏమిటో ప్రపంచానికి చూపగలిగామని అన్నారు. పండుగల సందర్భంగా అందరూ తమ వారితో కలసి సందడిగా పండుగ చేసుకోవాలని భావిస్తుంటారని అయితే మరో మారు ఓమిక్రాన్ పేరుతో నెమ్మదిగా పెరుగుతున్న corona మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని అందరూ సురక్షితమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కరోనా కాలంలో వైద్యులు చేసిన సేవలు వైద్యో నారాయణ హరి అన్న పదాన్ని నిరూపించాయని ఈ కోవలోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కూడా పని చేసిందని అన్నారు.
అంతకు ముందు నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను బాలకృష్ణ తిలకించారు. విద్యార్ధులను అభినందించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు చెందిన డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, శ్రీమతి కె శ్రీవాణి, నర్సింగ్ సూపర్నింటెండెంట్‌తో పాటూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.