Asianet News TeluguAsianet News Telugu

బోధన్ కమర్షియల్ ట్యాక్స్ లో నకిలీ చలాన్ల స్కాంపై చార్జీషీట్: 23 మంది అధికారులపై అభియోగాలు

బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంపై  చార్జీషీట్ దాఖలు చేసింది సీఐడీ. 23 మంది కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులపై  అభియోగాలు మోపింది సీఐడీ.

CID Files Chargesheet in Fake challan Scam in Commercial Tax lns
Author
First Published Jul 18, 2023, 1:59 PM IST

 


హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్  స్కాంపై  చార్జీషీట్ దాఖలు  చేశారు సీఐడీ అధికారులు. 23 మంది కమర్షియల్ శాఖకు చెందిన అధికారులపై  సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. 2012లో  కమర్షియల్ ట్యాక్స్ శాఖలో  నకిలీ చలాన్లతో రూ. 230 కోట్లు స్వాహా చేసిన విషయం వెలుగు చూసింది.

కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు  చార్జీషీట్ దాఖలు చేశారు.34 మందిని నిందితులుగా  సీఐడీ చేర్చింది. వీరిలో 23 మంది వాణిజ్య పన్నుల శాఖకు  చెందిన అధికారులున్నారు. 123 మందిని సాక్షులుగా  సీఐడీ చేర్చింది.చార్జీషీట్ లో  68 కంప్యూటర్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లను  పొందుపర్చారు సీఐడీ అధికారులు. 143 డాక్యుమెంట్లు,  మూడు ఆడిట్ రిపోర్టుల సారాంశాలను  కూడ  సీఐడీ అధికారులు  ప్రస్తావించారు.

వ్యాట్  బిల్లులను  నకిలీ చలాన్లతో  చెల్లించారని  సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఈ ఏడాది జూన్న మాసంలో లుగురిని  అరెస్ట్  చేశారు. కె.విజయ కుమార్,జగంటి రాజయ్య, ఎస్. సాయిలు, సిహెచ్ స్వర్ణలతను అరెస్ట్ చేశారు. 2012  లో బోధన్ లో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయ సిబ్బందిపై  సీఐడీ కేసు నమోదైంది.

సింహాద్రి లక్ష్మి శివరాజ్ అతని కొడుకు  సింహాద్రి వెంకట సునీల్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కుమ్మక్కయ్యారు.
వ్యాట్ చెల్లింపులకు సంబంధించి  నకిలీ చలాన్లను సృష్టించారని సీఐడీ  ఆరోపించింది.  దరిమిలా ప్రభుత్వ ఖజానాకు  రూ. 231. 22 కోట్ల నష్టం వచ్చిందని  సీఐడీ పేర్కొంది.2017లో  బోధన్ పట్టణ పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసులో మొత్తం  17 మందిని అరెస్ట్  చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios