మొయినాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు ప్రశంసనీయమని హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ అన్నారు. ఆయన తిరుమలలో ఉన్నంత సమయం చాలా జాగ్రత్తగా ఆచారాలను పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారని అన్నారు. 

మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సమయంలో జగన్ ప్రవర్తనని అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. జగన్ తో పాటు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారని... సీఎంకు కన్నతల్లిలా మారి సహాయం చేశారన్నారు. 

వీడియో

"

ఇక దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్న సౌందరరాజన్ ప్రస్తుత సీఎం జగన్ తండ్రి, మాజీ వైయస్ రాజశేఖర్ రెడ్డతో తనకున్న సానిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాల కొరకు చేస్తున్న పోరాటానికి తమ ఎంపీల ద్వారా మద్దతు తెలపాలని జగన్ ను కోరారు.  అలాగే ఆంధ్రప్రదేశ్ లో వెంటనే ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ల నోళ్లు మూయించవచ్చని సౌందరరాజన్ సీఎం జగన్ కు సలహా  ఇచ్చారు.