Asianet News TeluguAsianet News Telugu

చిలకలగూడ ఎస్సై సస్పెన్షన్, లంచం డిమాండ్ చేసినందుకు.....

రికవరీ వాహనాన్ని బాధితుడికి తిరిగివ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై సస్పెండ్ కు గురయ్యాడు. అవినీతి నిరోదక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఎస్సై పై సస్పెన్షన్ వేటు వేశారు.

Chilkalguda Sub-Inspector venkatadri suspended

రికవరీ వాహనాన్ని బాధితుడికి తిరిగివ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై సస్పెండ్ కు గురయ్యాడు. అవినీతి నిరోదక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఎస్సై పై సస్పెన్షన్ వేటు వేశారు.

వివరాలలోకి వెళితే...సికింద్రాబాద్ నామాలగుండుకు చెందిన సంతోష్ కుమార్ వామనం చోరీకి గురయ్యింది. దీంతో అతడు మే 17న  చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బైక్ కోసం గాలించారు. అయితే ఎట్టకేలకు 20 రోజుల తర్వాత కొంపల్లి ప్రాంతంలో ఈ వాహనాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు బైక్ దొరికిందని సంతోష్ కు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితుడికి బైక్ మాత్రం అప్పగించలేదు. తమకు డబ్బులు ఇస్తేనే వాహనాన్ని తిరిగి ఇస్తామని ఎస్సై వెంకటాద్రి తో పాటు రాజేష్ అనే కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సంతోష్ ఎసిబిని ఆశ్రయించాడు.

బాధితుడి నుండి ఫిర్యాదు స్వీకరించిన అవినీతి నిరోదక శాఖ అధికారులు ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్ రాజేష్ లకు నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణ జరిపి హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ కు నివేదిక ఇచ్చారు. దీంతో ఎస్సై వెంకటాద్రిని సస్పెండ్ చేస్తూ నగర సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios