నాందేడ్లో బీఆర్ఎస్ సభ .. కేసీఆర్తో ఛత్రపతి సాహూ మహారాజ్ మనవడి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చత్రపతి సాహూ మహారాజ్ మనవడు మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ భేటీ అయ్యారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చత్రపతి సాహూ మహారాజ్ మనవడు మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు చేయాలని కోరారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడం..జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని విస్తరించడమే లక్ష్యంగా ఈ సభ జరగనుంది. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడంతో.. అలాంటిదే మరో సభ రాష్ట్రం వెలుపల చేస్తే... పార్టీలో ఉత్సాహం మరింత పెరుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాందేడ్లో జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని.. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ బహిరంగ సభను ఈనెల 29వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. అయితే, మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ వెనక్కి తగ్గారు.
ALso REad: ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ..
మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. మండలికి సంబంధించి.. రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవేవీ సభకు అడ్డు రాకూడదన్న కారణంతోనే బిఆర్ఎస్ సభకు ఫిబ్రవరి 5ను ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.