చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగేడుపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆమెను గుజరాత్ కు చెందిన మహిళగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో ఓ అదృశ్యం కేసు నమోదైంది.

గుజరాత్ పోలీసులు ఆ కేసులో అదృశ్యమైన మహిళ ఫొటోలను సైబరాబాద్ పోలీసులకు పంపించారు. దాంతో సైబరాబాద్ పోలీసులు మహిళను గుజరాత్ చెందిందిగా గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు. మహిళ బంధువులను చేవెళ్లకు తీసుకురానున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు భావిస్తున్నారు.  

Also Read: వంతెన కింద మహిళ నగ్న దేహం: గాజుల్లో వజ్రాలు, దిమ్మతిరిగే విలువ

ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాల ఆధారంగా పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. మృతదేహంపై ఉన్న ఆభరణాలను, వాటిపై హాల్ మార్కును బట్టి పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఆమె ధరించిన గాజులు వజ్రాలతో పొదిగి ఉన్నాయి. ఆ వజ్రాల విలువ రూ. 15 లక్షలపైనే ఉంటుందని అంచనా వేశారు. 

35 ఏళ్ల వయస్సు గల ఆ మహిళ కాళ్లకు, చేతులకు కమిలిన గాయాలున్నాయని, దాన్ని బట్టి ఆమె కాళ్లను, చేతులను కట్టేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మెడకు తాడు బిగించి ఉరేశారని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఉరి బిగించి చంపి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపారని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. 

Also Read: కల్వర్టు కింద నగ్నంగా మహిళ శవం: అక్రమ సంబంధమే కారణమా?