చేర్యాల పాత నియోజకవర్గాన్ని పునరుద్దరించాలని , రెవెన్యూ డివిజన్ చేసి, జనగామా జిల్లాలో కలపాలని ఈ రోజు చేర్యాల ప్రజలు బంద్ నిర్వహించారు

చేర్యాల పాత నియోజకవర్గాన్ని పునరుద్దరించాలని , రెవెన్యూ డివిజన్ చేసి, జనగామా జిల్లాలో కలపాలని ఈ రోజు చేర్యాల ప్రజలు బంద్ నిర్వహించారు.చేర్యాల నియోజకవర్గ పోరాట సాధన సమితి ఆధ్యర్యంలో బంద్ జరిగింది. పోలీసుల అఖిల పక్షం నాయకులను అరెస్ట్ చేశారు.

తెలంగాణా మంత్రి టి హరీష్ రావు చేర్యాల పర్యటన సందర్భంగా ప్రభుత్వ తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈ బంద్ నిర్వహించారు. ఒకపుడు నియోజకవర్గంగా ఉన్న చేర్యాల డిలిమిటేషన్ లో ఆ హోదా కల్పోయింది. ప్రస్తుతం రెవెన్యూ డివిజనూ చేజారింది... మేజర్ మండలం స్థాయి నుంచి మైనర్ మండలం స్థాయికి పడిపోయిందని బంద్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా అంచెలంచెలుగా చేర్యాల స్థాయిని దిగజర్చిన నాయకులు, ఇపుడు ఒక చెరువును మినీ ట్యాంక్బండ్ చేస్తే అదే చేర్యాల అభివృద్ధి అని మంత్రికి మంగళహరతులు పడుతున్నారని బంద్ కు నాయకత్వం వహించిన ఉస్మానియా జెఎసి నాయకురాలు బాల లక్ష్మి అన్నారు.

చేర్యాల పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు .. చేర్యాల, మద్దూరు, కొమురేల్లి మండలాలను "సిద్దిపేట పెత్తనం' నుంచి కాపాడడానికి, నేటి చేర్యాల బంద్ కు పిలుపు నీయడం జరిగిందని, ఇది విజయవంతమయిందని ఆమె చెప్పారు.