సూర్యాపేటతో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో దోషాన్ని పోగొడతానని, బంగారాన్ని వెలికి తీస్తానని చెబుతూ ఓ వ్యక్తి మోసానికి పాల్పడుతున్నాడు. ఇళ్లలో నిలువునా గోతులు తవ్వి.. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తూ.. డబ్బులు దండుకుని మాయమవుతున్నాడు.
సూర్యాపేట : సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, Rural areaల్లో ఇంకా Superstitions స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. తాజాగా
Telanganaలోని Suryapeta జిల్లా చిలుకూరు చెమ్నారిగూడంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో గుంతలు తీసి, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన దృశ్యాలు సంచలనంగా మారాయి.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణ నష్టం కలుగుతుందని నమ్మించి శేషాచార్యులు అనే వ్యక్తి ఈ ఘటనలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా ఇంట్లో బంగారం ఉందని, వెలికి తీస్తానని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇళ్లల్లో గుంతలు తీసి పూజలు చేస్తున్నాడు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, వరంగల్ గీసుకొండలో కూడా గుప్తనిధుల కోసం బలి ఇచ్చిన ఘటన, భారీ స్థాయిలో బంగారం దొరికిన ఘటన వెలుగు చూసింది. Hidden treasures తవ్వకాలు లో పెద్ద ఎత్తున gold లభించినట్లు Gangadevipalliలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గ్రామానికి చెందిన యార మల్లారెడ్డి, మరో ఏడుగురు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 1818 వ సంవత్సరం నాటి 30 రాగినాణేలు బయటపడ్డాయి. ఆదివారం వాటిని విక్రయించేందుకు వెళ్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు బిళ్ళలు దొరికినట్లుగా గీసుకొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ social mediaల్లో వైరల్ అవుతుంది.
వారి మాటల ప్రకారం డిసెంబర్ 24న గుప్తనిధులు గుర్తించి బయటకు తీశారు. అందరూ సమానంగా పంచుకోవాలనుకున్నారు. అయితే అందులో నలుగురు మిగతా వారి కళ్లు కప్పి బంగారం మాయం చేశారు. ఇందులో సుమారు 140 కిలోల నుంచి మూడు క్వింటాళ్ల వరకు బంగారం ఉండి ఉంటుందని వారు సంభాషించుకున్నారు. గుప్త నిధులను బయటకు తీసేందుకు కోడెను బలిచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే రాగి నాణేలు మాత్రమే దొరికాయని పోలీసులు చెబుతున్నారు.
డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యారా మల్లారెడ్డికి గంగాదేవి గ్రామంలో సర్వే నంబర్ 375 లో 1.8 ఎకరాల భూమి ఉంది. భూమిలో గుప్తనిధులు ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. అలా చేయలేదు. గుప్తనిధులు వెలికితీయాలని నిర్ణయించుకున్న మల్లారెడ్డి గతనెల 23న అదే గ్రామానికి చెందిన పంజర బోయిన శ్రీనివాస్, మేడిద కృష్ణ, యాట పూర్ణచందర్ లతో కలిసి తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 1818 కాలం నాటి 30 రాగి నాణేలు బయటపడ్డాయి. వీటిని మహేష్ సాయంతో హైదరాబాదులో విక్రయించేందుకు మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టాస్క్ఫోర్స్ అధికారులకు సమాచారం తెలియడంతో నిందితులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులను గీసుకొండ పిఎస్ లో అప్పగించినట్లు తెలిపారు.
