మెదక్ లో కారులో కాలిన మృతదేహం: మృతుడు ధర్మాగా గుర్తింపు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కారులో సజీవదహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. జిల్లాలోని భీమ్లాతండాకు చెందిన ధర్మాగా పోలీసులు గుర్తించారు. భీమ్లాను ఎవరైనా హత్య చేశారా, ప్రమాదవశాత్తు మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కారులో సజీవ దహనమైన వ్యక్తి కేసులో పురోగతి కన్పించింది.కారులో నే సజీవ దహనమైన వ్యక్తిని ధర్మాగా గుర్తించారు. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ధర్మా పనిచేస్తున్నారు. జిల్లాలోని భీమ్లాతండా ధర్మా స్వగ్రామం.ఈ నెల 5వ తేదీన ధర్మా కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చారు. ఇవాళ ఉదయం కారులో ధర్మా సజీవ దహనమైనట్టుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు ధర్మా మృతి చెందాడా లేదా ధర్మాను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మా కారుకు సమీపంలో ఓ భాటిల్ లో పెట్రోల్ లభించింది. ధర్మా కటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని హృతుడి భార్య మీడియాకు చెప్పింది. ధర్మా మృతికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.