ప్రధాని నరేంద్రమోడీ రేపటి హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం భాగ్యనగరానికి రావాల్సిన ప్రధాని.. మధ్యాహ్నం ఒంటిగంటకే నగరానికి రానున్నారు.

ఒంటిగంటకి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని. అనంతరం అక్కడి నుంచి భారత్ బయోటెక్‌కు చేరుకుంటారు. తిరిగి మూడు గంటలకు హకీంపేటకు చేరుకుంటారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి.. మూడు గంటల 45 నిమిషాలకు హంకీంపేట్ రావాల్సి వుంది.

3 గంటల 50 నిమిషాలకు హకీంపేట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారత్ బయోటిక్ కంపెనీకి వెళ్లాలి. తిరిగి సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా మళ్లీ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి వుంది. 

పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పర్యటించేలా ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. దీని తర్వాత సాయంత్రం 4 గంటలకు మోదీ హైదరాబాద్‌కు వచ్చేలా ప్రణాళిక చేశారు. ఇప్పుడు పుణె ప్రోగ్రాం రద్దు కావడంతో మోదీ మధ్యాహ్నం 1 గంటలకే హైదరాబాద్ రానున్నారు.