కాంగ్రెసుతో పొత్తుపై చంద్రబాబు మాట ఇదీ...

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 8, Sep 2018, 8:50 PM IST
Chandrababu clarifies on alliance with Congress
Highlights

తెలంగాణలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వ్యవహరించారు. తెలంగాణ టీడీపి విస్తృతం స్థాయి సమావేశంలో ఆయన శనివారం సాయంత్రం మాట్లాడారు.

హైదరాబాద్: తెలంగాణలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వ్యవహరించారు. తెలంగాణ టీడీపి విస్తృతం స్థాయి సమావేశంలో ఆయన శనివారం సాయంత్రం మాట్లాడారు.

 తన ప్రసంగంలో ఎక్కడ కూడా కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. పొత్తుల నిర్ణయం తెలంగాణ నేతలదేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేయబోనని ఆయన పరోక్షంగా చెప్పారు. తెలంగాణలో పార్టీ బాగు కోసం ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ నేతలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.  ఎన్నికల్లో పోరాడాలని, తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌తో వెళ్లాల్సి వచ్చినా నేతలే ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం పార్టీ పనిచేయాలని, సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ఇక్కడికి రాలేనని చెప్పారు. తన ప్రసంగంలో టీఆర్‌ఎస్‌ పై గానీ కేసీఆర్‌పై గానీ ఆయన విమర్శలు చేయలేదు. తెలంగాణ గడ్డపై కూడా టీడీపీ ఉండాలని, చారిత్రక అవసరమని మాత్రమే అన్నారు. 

ఈ వార్తాకథనం చదవండి

నాకు, కేసీఆర్ కు మధ్య ప్రధాని చిచ్చు పెట్టాలని చూశారు...మోదీపై బాబు ఫైర్

loader