హైదరాబాద్: చందానగర్ లోని హేమంత్ తన ఇంటికి సమీపంలో ఉంటున్న అవంతి ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం అవంతి తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో నిరుడు నవంబర్ నుంచి ఆమెను ఇంట్లో నిర్బంధించారు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ వచ్చారు. 

ఆ స్థితిలో అవంతి జూన్ 10వ తేదీన తప్పించుకుని ఇంటి నుంచి వచ్చింది. హేమంత్, అవంతి ఇద్దరు కలిసి బిహెచ్ఈఎల్ సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లిని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దాంతో హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్డీవో కాలనీలో నివాసం ఉంటూ వచ్చారు.

వీడియో

"

గురువారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అవంతి బావలు, వదినలు, మామయ్యలు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చారు. ఇద్దరిని బవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గమధ్యలో అవంతి కారునుంచి దూకేసి పారిపోయింది. 

ఈ విషయాన్ని హేమంత్ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా కూడా జాడ తెలియలేదు. శుక్రవరాం ఉదయం శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్ శవమై కనిపించాడు.  ఆ క్రమంలో హేమంత్, అవంతిల ప్రేమ వివాహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.