మునుగోడు కాంగ్రెస్ లో ముసలం.. ఇండిపెండెంట్ గా బరిలోకి చలమల కృష్ణారెడ్డి !
నల్గొండలో మునుగోడు కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో చలమల్ల క్రిష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
నల్గొండ : మునుగోడు కాంగ్రెస్ లో అసంతృప్తులు మొదలయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ కేటాయించడంతో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మునుగోడు టికెట్ ను చలమల కృష్ణారెడ్డి ఆశించారు. అయితే, టికెట్ దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం అనుచరులతో కృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు చలమల కృష్ణారెడ్డి సిద్ధమవుతున్నారు.
మరోవైపు పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ రెండో జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ తనకు రాకపోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అజారుద్దీన్ కి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ లో విష్ణువర్ణన్ కు టికెట్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ ను మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణువర్ణన్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయి, చర్చించిన తరువాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.