Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ చైతన్య రథం మూడు తరాలకు ప్రచార వాహనం

 సినీనటుడు,మాజీ ఎంపీ హరికృష్ణ అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ పార్థివదేహం మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది. రాజకీయ ప్రముఖులు, సినీనటులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4గంటలకు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ జోషిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

Chaitanya Ratham used by HariKrishna
Author
Hyderabad, First Published Aug 29, 2018, 5:20 PM IST

హైదరాబాద్: సినీనటుడు,మాజీ ఎంపీ హరికృష్ణ అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ పార్థివదేహం మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది. రాజకీయ ప్రముఖులు, సినీనటులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. 

హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4గంటలకు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ జోషిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

అయితే హరికృష్ణ పార్ధివదేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. హరికృష్ణ నడిపిన చైతన్య రథంపై అంతిమయాత్ర జరుగనుంది.
ఈ చైతన్యరథానికి ఎన్టీఆర్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. 1982లో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్  ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనమే చైతన్య రథం. ఈ చైతన్య రథంపై నుంచే ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుమారు ఏడాది పాటు చైతన్య రథంపై రాష్ట్రాన్ని చుట్టేశారు.  

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రావడం...ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత హరికృష్ణ స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీ  ఎన్నికల ప్రచారాన్ని కూడా అదే చైతన్యరథంపై నిర్వహించారు. అచ్చం ఎన్టీఆర్ ను తలపించేలా కాకి చొక్కా, ప్యాంట్ వేసుకుని ప్రచారం చేశారు. 

ఆ తర్వాత 2009లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ సైతం చైతన్య రథంపై నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అచ్చం తాతయ్య ఎన్టీఆర్ ను మరపించేలా చైతన్యరధంపై ఎన్నికల ప్రచారం చేశారు. నందమూరి కుటుంబానికి చెందిన మూడు తరాలు చైతన్యరథంపై ప్రచారం చేశాయి. అంతటి అనుబంధం ఉన్న చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర జరగనుంది. చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించడం ఘనమైన నివాళి అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios