తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
నాగర్ కర్నూల్ : ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నాగర్ కర్నూల్, కారుకొండలోని ఓ ఫామ్ హౌజ్ లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
సాయిచంద్ వయసు 39 సం.లు. విద్యార్థి దశనుంచే సాయిచంద్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఉద్యమస్పూర్తిని రగిలించిన గాయకుడు సాయిచంద్. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, మంత్రులు సంతాపం తెలిపారు.
