Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంటి వద్ద దారుణం .. వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన చైన్‌ స్నాచర్లు

హైదరాబాద్‌ పద్మారావు నగర్ కాలనీలోని  ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంటి గేటు వద్ద దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న వృద్ధురాలి మెడలోంచి చైన్ స్నాచర్లు గొలుసు లాక్కెళ్లారు. 

chain snatching at director shekhar kammulas house in hyderabad ksp
Author
First Published Jul 19, 2023, 2:28 PM IST

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై , పట్టపగలు దొంగతనాలు చేస్తూ జనాన్ని వణికిస్తున్నారు. ఒక్కసారి టార్గెట్ చేస్తే చైన్ చేతులో వుండాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మహిళలు గడప దాటాలంటే వణికిపోతున్నారు. తాజాగా నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పద్మారావు నగర్ కాలనీలోని  ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంటి గేటు వద్ద ఈ చైన్ స్నాచింగ్ జరగడం గమనార్హం. 

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలోంచి ఓ యువకుడు చైన్ లాక్కెళ్లాడు. మెడ నుంచి చైన్ గట్టిగా లాగడంతో వృద్ధురాలు కిందపడిపోయి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం  చైన్ స్నాచింగ్‌పై బాధితురాలు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios