హైదరాబాద్‌లోని ఘట్ కేసర్‌లో ఓ చైన్ స్నాచర్ హల్ చల్ చేశాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్న 52 ఏళ్ల ఉపాధ్యాయురాలి మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రంపై కన్నేశాడు. ఆమె కంట్లో కారం చల్లి తాళి పట్టుకుని పారిపోయాడు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓ చైన్ స్నాచర్ కలకలం రేపాడు. బస్టాండ్‌లో బస్ కోసం ఎదురుచూస్తున్న ఓ ఉపాధ్యాయురాలి మెడలో బంగారు మంగళసూత్రంపై చైన్ స్నాచర్ కన్నేశాడు. ఏమీ ఎరగనట్టు ఆమె దగ్గర దాకా వెళ్లాడు. సమీపించిన తర్వాత ఆమె కళ్లలో కారం పొడి విసిరాడు. వెంటనే ఆమె మెడలోని తాళిని లాగాడు. మంగళసూత్రాన్ని పట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో పరారైపోయాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో చోటుచేసుకుంది.

బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) హన్మకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శివారెడ్డి గూడ చౌరస్తాలోని బస్ స్టాండ్‌కు వచ్చింది. బస్సు కోసం వెయిట్ చేస్తున్నది. అదే సమయంలో అక్కడికి ఓ దొంగ వచ్చాడు. ఆమె కంట్లో కారం కొట్టి మంగళసూత్రం దొంగిలించి పరారయ్యాడు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పారిపోయినట్టు బాధితురాలు తెలిపారు.

Also Read: తప్పుడు రికార్డులతో బ్యాంకులో కోట్ల రూపాయిలు కొల్లగొట్టి 14 ఏళ్లుగా అజ్ఞాతం..ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు

దొంగిలించిన బంగారు చైన్ బరువు మూడున్నర తులాలు ఉంటుందని తెలిసింది.