Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర విధానాలతో ఆర్ధిక వృద్ది మందగించింది:కేబినెట్ సమావేశంలో కేసీఆర్


కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ ఆర్ధిక వృద్ది మందగించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ కేబినెట్ సమావేశం గురువారం నాడు హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో నిధుల సమీకరణ విషయమై చర్చించారు. 

Centre Government policies slowed down economic growth in Telangana:KCR
Author
Hyderabad, First Published Aug 12, 2022, 10:28 AM IST


హైదరాబాద్: కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ ఆర్ధిక వృద్ది మందగించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 11న ప్రగతి భవన్ లో జరిగింది. రాష్ట్రానికి  అదనపు నిధుల సమీకరణ విషయమై కేబినెట్ స.మావేశంలో చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే రుణాలపై ఆంక్షలు, నిధుల గ్రాంట్లలో కోత, పన్నుల పంపిణీలో కోత లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 

గత ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి  సీఎస్ఎస్ కింద కేవలం రూ. 47,312 కోట్ల నిధులు వచ్చినట్టుగా ఆర్ధిక శాఖాధికారులు కేబినెట్ కు వివరించినట్టుగా సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 1.84 లక్షల కోట్ల వ్యయం. అయితే ఇందులో రూ. 5200 కోట్లు మాత్రమే సీఎస్ఎస్ కింద నిధులు విడుదల చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15. 3 శాతం వృద్ది రేటు నమోదైందని అధికారులు కేబినెట్ కు తెలిపారు. జాతీయ ఖాతాల వ్యవస్థను ప్రవేశ పెట్టడం వల్ల రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతుందని సీఎంఓ అభిప్రాయపడింది. అంతేకాదు ఎఫ్ఆర్ బీఎంను కూడా సకాలంలో ఖరారు చేయలేదు. పరిమితుల్లో కూడా కోత  అమలు చేస్తుందని  ఈ సమావేశం అభిప్రాయపడింది.ఎఫ్ఆర్‌బీఎం పై పరిమితులు, కోతలు లేకపోతే రాష్ట్ర ఆదాయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. అదే జరిగితే రాస్ట్ర వృద్ది 22 శాతంగా ఉండేదని అధికారులు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్టుగా ఈ ప్రకటన తెలిపింది.

దేశ జనాబాలో తెలంగాణ రాష్ట్ర జనాభా 2.5 శాతం మాత్రమే. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం దేశ ఆదాయంలో ఐదు శాతం వాటాను అందించిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర పన్నుల రాబడిలో 11. 5 శాతం వృద్దితో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ గా నిలించిన విషయాన్ని ఆర్ధికశాఖాధికారులు కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు.

కేంద్రం ఆర్ధిక అవరోధాలు సృష్టిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించేందుకు గాను స్వంతంగా ఆదాయ వనరులను పెంచుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషించాలని కూడా ఆర్ధిక శాఖాధికారులను సీఎం ఆదేశించారని సమాచారం.

గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో 1.55 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించినట్టుగా ఐటీ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఐటీ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న బెంగుళూరు 1.48 లక్షల ఉద్యోగాలను సృష్టించిన విషయాన్ని జయేష్ రంజన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బెంగుళూరు కంటే హైద్రాబాద్ లోనే ఎక్కువ ఉద్యోగాలు లభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రత్యేక విధానాలు, ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, మౌళిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనరుల లభ్యత వంటి అంశాలతో అభివృద్ది సాధ్యమైందని అధికారులు కేబినెట్  కు వివరించారు.

also read:ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. 5 గంటల పాటు సమావేశం, నిర్ణయాలివే

రాష్ట్రంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ది చెందడంపై  సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios