ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. 5 గంటల పాటు సమావేశం, నిర్ణయాలివే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ (telangana cabinet meeting) ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ (telangana cabinet meeting) ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాలివే:
- ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు .
- ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుకోనుంది.
- స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ ఆమోదం.
- కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు నిర్ణయం
- సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
- ఖాళీగా వున్న 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నిర్ణయం
- జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ వేగవంతం
- వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలు మంజూరు