Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండాల పంపిణీలో కేంద్రం విఫలం: మంత్రి హరీశ్ రావు

Telangana: మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం 1.2 కోట్ల జాతీయ జెండాలను తయారు చేసిందనీ, వీటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు వెల్ల‌డించారు. 
 

Centre failed to distribute national flags, says Telangana Minister  Harish Rao
Author
Hyderabad, First Published Aug 11, 2022, 2:41 PM IST

Telangana Minister  Harish Rao: దేశంలోని పౌరులకు సరిపడా జాతీయ జెండాలను పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు గురువారం అన్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌ కట్టపై ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్‌ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాలను అందించడంలో కేంద్రం విఫలమైందన్నారు. జెండాలు పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైనందున, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పౌరులు ఫాబ్రిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను కాకుండా కాగితం ఆధారిత జాతీయ జెండాలను స్వీకరించాలని సూచించారని మంత్రి హ‌రీశ్ రావు  అన్నారు. 

అయితే, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం 1.2 కోట్ల జాతీయ జెండాలను తయారు చేసిందనీ, వీటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్ల‌డించారు. స్వాతంత్య్ర పోరాటంలో భార‌త జాతిపిత మహాత్మాగాంధీ పోషించిన పాత్ర గురించి మంత్రి మాట్లాడుతూ.. గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకి దేశంలోని కొన్ని సంస్థలు మద్దతు ఇచ్చాయని, అవి వ్యవస్థాపక పితామహుడికి వ్యతిరేకంగా తరచూ మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు.  అలాంటి సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. గాంధీకి వ్య‌తిరేకంగా న‌డుచుకుంటున్న సంస్థ‌లు, వ్య‌క్తుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థలను దేశం నుండి బహిష్కరించే సమయం ఆసన్నమైందని  మంద్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. 
 

 

ఇదిలావుండగా, 

'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద ర్యాలీలు, సామూహిక గీతాలాపన, క్రీడాపోటీలు నిర్వహించాలని జిల్లా అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. స్వాతంత్య్ర‌ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేసి వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారుల‌తో రాష్ట్ర సీఎస్ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే..  'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు/పోలీసు సూపరింటెండెంట్లు, డీఈఓలు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి రాబోయే వారాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో ప్రదర్శింపబడిన “గాంధీ” చిత్రాన్ని ఈరోజు 2.2 లక్షల మంది పాఠశాల విద్యార్థులు చూశారని ప్రధాన కార్యదర్శి తెలిపారు. 16న పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా జాతీయ గీతాలాపనను నిర్వహించనున్నారు. అదేవిధంగా 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ, మండలం, మున్సిపాలిటీ, జిల్లాకేంద్రాల్లో ఫ్రీడమ్‌కప్‌ క్రీడాపోటీలు నిర్వహించి యువత, అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios