Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం కీలక నిర్ణయం

తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మ‌రో 6.05 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని కేంద్రం నిర్ణయించింది. 

Centre allows Telangana to deposit 6 05 lakh metric tonnes of fortified parboiled rice with FCI
Author
New Delhi, First Published May 14, 2022, 5:47 PM IST

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కొంతకాలంగా కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మ‌రో 6.05 లక్షల మెట్రిక్ ట‌న్నుల (LMT) ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని కేంద్రం నిర్ణయించింది. 

ఈ మేరకు కేంద్ర ఆహార‌, ప్రజా పంపిణీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌ ఒక ప్రకటనలో పేర్కొంది. భార‌త ఆహార సంస్థకు (Food Corporation of India) బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం స‌మాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని బుధవారం (మే 11) ఈ మేరకు లేఖ జారీ చేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ధాన్యం సేకరణలో అన్ని రాష్ట్రాలకు మద్దతు ఉంటుందని కేంద్రం పేర్కొంది. 

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21, 2021-22 యొక్క మిగిలిన వరిని డిపాజిట్ చేయడానికి తెలంగాణకు కేంద్రం అనుమతించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2020-21 కస్టమ్డ్ మిల్డ్ రైస్ (CMR).. మిల్లింగ్/డెలివరీ గడువు వాస్తవానికి సెప్టెంబర్ 2021తో. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇది ఏడోసారి(2022 మే వరకు) పొడిగించినట్టుగా తెలిపింది.

గతంలో.. 2022 జూన్ సేకరణ  కాలం, సెప్టెంబర్ మిల్లింగ్ వ్యవధితో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22లో తెలంగాణలో 40.20 లక్షల మెట్రిక్ టన్నలు బియ్యం సేకరణ అంచనాను కేంద్రం ఆమోదించింది. “తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో సేకరణ కార్యకలాపాలకు భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. KMS 2015-16లో కొనుగోలు చేసిన 15.79 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కనీస మద్దతు ధర రూ. 3,417.15 కోట్ల విలువతో కొనుగోలు చేయగా 5,35,007 మంది రైతులకు లబ్ది చేకూర్చగా.. KMS 2020-21లో తెలంగాణలో 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కనీస మద్దతు ధర రూ. 26,637.39 కోట్ల విలువతో కొనుగోలు చేయగా 21,64,354 మంది రైతులకు లబ్ది చేకూరింది’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

2022 మే 11 నాటికి కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22లో.. 72.71 లక్షల మెట్రిక్ టన్నుల వరి (48.72 LMT సమానమైన బియ్యం) కొనుగోలు చేయబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వలన 11,14,833 మంది రైతులకు కనీస మద్దతు ధర విలువ రూ. 14251.59 కోట్లు 

 2022 మే 11 నాటికి, కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22లో, 72.71 LMT వరి (48.72 LMT సమానమైన బియ్యం) కొనుగోలు చేయబడింది. దీని వలన MSP విలువ రూ. 14251.59 కోట్లతో 11,14,833 మంది రైతులకు లబ్ది చేకూరిందని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios