Mehdipatnam Sky Walk: మెహదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌ .. ఆ భూమిని అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Mehdipatnam Sky Walk: హైదరాబాద్ లోని  మెహదీపట్నం స్కైవాక్‌ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టును పూర్తి కోసం కేంద్రం రక్షణ భూమిని అప్పగించడానికి అంగీకరించింది.

Centre agrees to handover 3380 sq yd of Defence land for Mehdipatnam Skywalk KRJ

Mehdipatnam Sky Walk: మెహదీపట్నంలో నిర్మిస్తున్న స్కైవాక్‌ కు లైన్ క్లియర్ అయ్యింది. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 3380 చదరపు గజాల రక్షణ భూమిని అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. తాజా డిజైన్‌కు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. స్కైవాక్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన భూమిపై కేంద్రంతో ఒప్పందం కుదిరిన తర్వాత.. మెహదీపట్నం ప్రాంతంలో పాదచారుల రాకపోకలను సులభతరం చేసే ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

జనవరి 5న ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రితో భేటీ అయిన సీఎం రేవంత్ .. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. వీరి భేటీ తర్వాత తాజా పరిణామం చోటు చేసుకుంది . రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రేవంత్ ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడమే కాకుండా పాదచారుల సురక్షిత మార్గం కోసం మెహిదీపట్నంలోని రైతు బజార్‌లో స్కైవాక్‌ను పూర్తి చేయడానికి 0.21 హెక్టార్ల రక్షణ భూమిని కోరారు.

స్కైవే నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపులో జాప్యం కారణంగా పెండింగ్‌లో ఉందని రక్షణ మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. నగరంలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాలలో పాదచారుల సమస్యపై ఆయన విస్తృతంగా చర్చించారు. సానుకూల స్పందన తర్వాత ముఖ్యమంత్రి కూడా డిఫెన్స్ జోన్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను సవరించారు. 

ఈ తరుణంలో 3380 చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఇచ్చేందుకు రూ.15.15 కోట్ల విలువైన రక్షణ రంగానికి మౌళిక సదుపాయాలు కల్పించాలని కేంద్రం కోరింది.మరో నాలుగు వారాల్లో కేంద్రం భూమి అప్పగింత ప్రక్రియ పూర్తి కానున్నది. దీనితో ప్రధాన ప్రాజెక్ట్ కోసం రోడ్‌బ్లాక్‌లు క్లియర్ చేయబడ్డాయి.  పాదచారులు ముంబై హైవే మీదుగా కొన్ని నెలల్లో స్వేచ్ఛగా నడవగలరని అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios